Surprise Me!

India vs Sri Lanka : Virat Kohli May Surpass This Cricketer Record | Oneindia Telugu

2017-11-14 287 Dailymotion

India are hot favourites in the upcoming three-Test series against Sri Lanka, starting on Thursday. Captain Virat Kohli will surpass former India captain Sourav Ganguly's record of 21 Test wins as captain (49 games), if the home side manages a 3-0 clean sweep <br /> <br />టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో వ్యక్తిగత రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ మరో రికార్డుని బద్దలు కొట్టేందుకు సమీపంలో ఉన్నాడు. భారత్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచేందుకు కోహ్లీ మూడు టెస్టుల దూరంలో ఉన్నాడు. భారత్ తరుపున అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోని అగ్రస్ధానంలో ఉన్నాడు. ధోని నేతృత్వంలో టీమిండియా 60 మ్యాచ్‌లాడగా 27 మ్యాచుల్లో జట్టు గెలిచింది. <br />ఆ తర్వాత గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా 49 టెస్టులకు 21 విజయాలు సాధించింది. ఇక, కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు 29 టెస్టు మ్యాచ్‌లాడగా అందులో 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో రెండు టెస్టులు గెలిస్తే గంగూలీ రికార్డుని కోహ్లీ సమం చేస్తాడు. అదే మూడు టెస్టులు గెలిస్తే గంగూలీ రికార్డుని అధిగమిస్తాడు.

Buy Now on CodeCanyon